Share News

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రతిపాదనలు అందాయి

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:05 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందాయని కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రతిపాదనలు అందాయి

  • రాజ్యసభలో కేంద్ర మంత్రి టోఖన్‌ సాహు వెల్లడి

  • కాజీపేట రైల్వే జోన్‌ కల నెరవేర్చండి: కావ్య

న్యూఢిల్లీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందాయని కేంద్రం వెల్లడించింది. సోమవారం ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ రేణుకాచౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి టోఖన్‌ సాహు సమాధానమిచ్చారు. మెట్రో రైలు ప్రాజెక్టులు భారీ వ్యయంతో కూడుకున్నవని, ఈ ప్రతిపాదనల ఆమోదం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ లేదా బలమైన సబ్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కడియం కావ్య కోరారు. కాగా, తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించాలని కాంగ్రెస్‌ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి సూచించారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఇచ్చిన విందుకు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌, మల్లు రవి, అనిల్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, నగేశ్‌ హాజరయ్యారు.

Updated Date - Mar 17 , 2026 | 05:05 AM