Share News

హైదరాబాద్‌లో రైలు-మెట్రో- బస్‌ అనుసంధానం

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:45 AM

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ ఉపనగర రైలు, మెట్రో రైలు, టీజీఎ్‌సఆర్టీసీ బస్సు ేసవలను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సమన్వయ ప్రణాళిక ప్రారంభించిందని రవాణా...

హైదరాబాద్‌లో రైలు-మెట్రో- బస్‌ అనుసంధానం

  • సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో సర్కారు

  • 51 ఎంఎంటీఎస్‌ అనుసంధాన రోడ్ల విస్తరణ

  • ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ ఉపనగర రైలు, మెట్రో రైలు, టీజీఎ్‌సఆర్టీసీ బస్సు ేసవలను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సమన్వయ ప్రణాళిక ప్రారంభించిందని రవాణా, రోడ్లు--భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌ తెలిపారు. ప్రయాణికులకు మొదటి--చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, రహదారి రద్దీని తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంపొందించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో మల్టీమోడల్‌ రవాణా వ్యవస్థ దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. 51 ఎంఎంటీఎస్‌ ేస్టషన్ల చుట్టుపక్కల అనుసంధాన రహదారులను విస్తరించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించామన్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ఎంఎంటీఎస్‌ ేస్టషన్లు, ప్రధాన క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల వివరాలను దక్షిణ మధ్య రైల్వే... జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీతో పంచుకుంటుందన్నారు. దీని ఆధారంగా బస్‌స్టాప్‌లను ఎంఎంటీఎస్‌ ేస్టషన్లకు మరింత దగ్గరగా మార్చడం, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అనుగుణంగా బస్సు మార్గాలను పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందన్నారు. ఎంఎంటీఎస్‌ ేస్టషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రైవేట్‌ ఫీడర్‌ ేసవలు ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. మెట్రో, ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సులన్నింటికీ వర్తించే సమగ్ర టికెటింగ్‌ వ్యవస్థ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మీ- సేవ కమిషనర్‌కు సూచించినట్లు తెలిపారు.

Updated Date - Jan 21 , 2026 | 05:48 AM