Share News

ఎవరెస్టు శిఖరంపై హైదరాబాదీ..!

ABN , Publish Date - May 21 , 2026 | 03:09 AM

ప్రయత్నమంటూ ఉంటే ఫలితం తప్పక ఉంటుందని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన పలపునూరి తులసిరెడ్డి. కుత్భుల్లాపూర్‌ మండలం భౌరంపేట..

ఎవరెస్టు శిఖరంపై హైదరాబాదీ..!

  • మౌంట్‌ ఎవరెస్టును అధిరోహించినఐరన్‌మ్యాన్‌ పలపునూరి తులసిరెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రయత్నమంటూ ఉంటే ఫలితం తప్పక ఉంటుందని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన పలపునూరి తులసిరెడ్డి. కుత్భుల్లాపూర్‌ మండలం భౌరంపేట గ్రామానికి చెందిన తులసి రెడ్డి అత్యంత క్షిష్టమైన ఎవరెస్టు శిఖరాన్ని బుధవారం అధిరోహించారు. పర్వతారోహణతోపాటు ఎండ్యూరెన్స్‌ స్పోర్ట్స్‌ పట్ల అమితాసక్తిని కనబరిచే తులసి రెడ్డి గతంలోనే ఐరన్‌మ్యాన్‌ చాలెంజ్‌ను పూర్తి చేశారు. ఎవరెస్టు కంటే ముందు మౌంట్‌ ఎల్బ్రస్‌ (యూరోప్‌), కిలిమంజారో (ఆఫ్రికా), అకాన్‌కాగువా (దక్షిణ అమెరికా) సహా పలు పర్వత శిఖరాలను అధిరోహించారు. ఓ సాధారణ ఫిట్‌నెస్‌ ప్రేమికునిగా తన పర్వతారోహణ ప్రయాణం ప్రారంభమైందంటున్న తులసి రెడ్డి.. సంవత్సరాల తరబడిన కఠోర శ్రమ, ఎండ్యూరెన్స్‌ శిక్షణ ఎవరెస్టును అధిరోహించడంలో తనకు తోడ్పడ్డాయని వెల్లడించారు.

Updated Date - May 21 , 2026 | 03:09 AM