Share News

జీహెచ్‌ఎంసీలో ఇళ్ల దరఖాస్తుకు 2 రోజులే గడువు

ABN , Publish Date - Aug 09 , 2026 | 06:20 AM

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ పథకంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులే గడువు ఉందని హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతం తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో ఇళ్ల దరఖాస్తుకు 2 రోజులే గడువు

  • 16 నియోజకవర్గాల్లో 7340 ఇళ్లకు 35125 దరఖాస్తులు

  • 20తర్వాత లాటరీ, ఏడాదిలోపు అందజేత

  • హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ వి.పి.గౌతం

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ పథకంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులే గడువు ఉందని హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతం తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుదారులకు ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 20 లాటరీ తీస్తామని, ఏడాది లోపు లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో నిర్మిస్తున్న 7340 ఇళ్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చాయని వి.పి.గౌతం తెలిపారు. ఈ నెల పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు. ఇండ్లు కేటాయించని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు ఫీజు రూ.10వేలు తిరిగి చెల్లిస్తామని తెలిపారు.

Updated Date - Aug 09 , 2026 | 06:22 AM