Share News

నేడు అఖిలపక్షం యుద్ధ వ్యతిరేక ర్యాలీ

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:00 AM

అమెరికా-ఇరాన్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని చార్మినార్‌ నుంచి నాంపల్లి...

నేడు అఖిలపక్షం యుద్ధ వ్యతిరేక ర్యాలీ

  • చార్మినార్‌ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు..

  • పాల్గొననున్న మహేశ్‌గౌడ్‌, రాఘవులు, కోదండరాం

హైదరాబాద్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అమెరికా-ఇరాన్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని చార్మినార్‌ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వరకు భారీ ర్యాలీ జరగనుంది. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొననున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తదితరులు పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోదండరాం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Updated Date - Mar 29 , 2026 | 07:03 AM