Share News

వ్యవసాయేతర భూముల పన్ను చట్టం నిబంధనలపై తీర్పు రిజర్వు

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:58 AM

వ్యవసాయేతర భూముల పన్ను మదింపు చట్టం(నాలా యాక్ట్‌)- 1963లోని నిబంధనల చట్టబద్ధతపై హైకోర్టు విస్తృత స్థాయి ధర్మాసనం తన తీర్పును రిజర్వు చేసింది.

వ్యవసాయేతర భూముల పన్ను చట్టం నిబంధనలపై తీర్పు రిజర్వు

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర భూముల పన్ను మదింపు చట్టం(నాలా యాక్ట్‌)- 1963లోని నిబంధనల చట్టబద్ధతపై హైకోర్టు విస్తృత స్థాయి ధర్మాసనం తన తీర్పును రిజర్వు చేసింది. ఈ చట్టంలోని నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విస్తృత స్థాయి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. నాలా చట్టానికి 1994లో సవరణలు తేవడంతోపాటు ముందు తేదీతో అంటే 1993 జూలై 1 నుంచి సదరు సవరణలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. అలాగే, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయేతర భూములకు వివిధ స్లాబుల్లో పన్నులను అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ముందు తేదీతో సవరణల అమలును పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటు పిటిషనర్లు అటు ప్రభుత్వం వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Mar 19 , 2026 | 03:58 AM