కాలేజీల తప్పులకు విద్యార్థులు నష్టపోకూడదు
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:40 AM
పరీక్ష ఫీజుల చెల్లింపు విషయమై కాలేజీ యాజమాన్యాల తప్పుల కారణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని హైకోర్టు పేర్కొంది.
హాల్‌టికెట్లు ఇవ్వండి.. ప్రాక్టికల్స్ పెట్టండి
ఇంటర్‌బోర్డుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): పరీక్ష ఫీజుల చెల్లింపు విషయమై కాలేజీ యాజమాన్యాల తప్పుల కారణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని హైకోర్టు పేర్కొంది. హాల్‌టికెట్లు జారీ కాని విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రాక్టికల్స్ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలు జారీచేసింది. ప్రధాన పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు సైతం జారీచేయాలని పేర్కొంది. పరీక్ష ఫీజుల చెల్లింపుల్లో కాలేజీ యాజమాన్యాల తప్పిదాల కారణంగా హాల్‌టిక్కెట్లు పొందని విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.