జంట జలాశయాల్లో కాలుష్యంపై ఏం చేస్తున్నారు?
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:39 AM
దశాబ్దాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి అవసరాలను తీరుస్తున్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలోకి పారిశ్రామిక వ్యర్థ జలాలు....
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి అవసరాలను తీరుస్తున్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలోకి పారిశ్రామిక వ్యర్థ జలాలు, కలుషిత నీరు చేరకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ జలమండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు నోటీసులు జారీచేసింది. జంట జలాశయాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణను మార్చి 26కు వాయిదా వేసింది.