సందీప్‌కుమార్ సుల్తానియాపై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:50 AM
బిల్లుల చెల్లింపు విషయమై టోకెన్లు జారీ చేసి నిధులు విడుదల చేయనందుకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియాపై...
సందీప్‌కుమార్ సుల్తానియాపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): బిల్లుల చెల్లింపు విషయమై టోకెన్లు జారీ చేసి నిధులు విడుదల చేయనందుకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చినా నిధులు విడుదల చేయలేదంటూ శ్రీసాయి ఫిష్‌సీడ్స్ తదితరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో చెల్లింపులు చేయని పక్షంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఎన్‌సీసీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని గత ఆగస్టులో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరుకానందుకు సుల్తానియాపై అసహనం వ్యక్తం చేసింది. వారంలో రూ.198 కోట్ల బకాయిలను ఎన్‌సీసీకి చెల్లించాలని లేకపోతే కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.