హైదరాబాద్‌లో కుండపోత
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:28 AM
హైదరాబాద్‌లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని..
సీఎం రేవంత్ విమానం దారిమళ్లింపు
బెంగళూరు నుంచి నేడు హైదరాబాద్‌కు
హైదరాబాద్‌లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగుళూరుకు దారి మళ్లించారు. సీఎం ఢిల్లీ నుంచి 6ఈ717 ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ విమానం శుక్రవారం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ సమయానికి విమానాశ్రయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విమానం ల్యాండ్ చేసే అవకాశం లేకపోవడంతో ఏటీసీ సూచనల మేరకు పైలట్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఆ విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ శనివారం హైదరాబాద్ రానున్నారు. కాగా, భారీ వర్షం వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.