Share News

ఎల్లంపల్లి పరిహారంపై హైకోర్టు సీరియస్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:58 AM

శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలపై హైకోర్టు స్పందించింది. రెండు దశాబ్దాలు గడుస్తున్నా పరిహారం అందకపోవడంపై విచారణ చేపట్టిన ధర్మాసనం...

ఎల్లంపల్లి పరిహారంపై హైకోర్టు సీరియస్‌

  • అధికారుల వివరణ కోరిన ధర్మాసనం

హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలపై హైకోర్టు స్పందించింది. రెండు దశాబ్దాలు గడుస్తున్నా పరిహారం అందకపోవడంపై విచారణ చేపట్టిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులుజారీ చేసింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చేగ్యం గ్రామానికి చెందిన 126 కుటుంబాలు 20ఏళ్లుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నాయి. తొలుత రూ.58 కోట్ల పరిహారం ఇస్తామని జీవో జారీచేసిన అప్పటి ప్రభుత్వం, ఆ తర్వాత దాన్ని రూ.28కోట్లకు, ఇప్పుడు ఏకంగా రూ.18 కోట్లకు తగ్గించిందని పిటిషనర్లు ఆరోపించారు. వాదనలు విన్న జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పరిహారం చెల్లించకపోవడంపై వివరణ ఇవ్వాలని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్‌, భూసేకరణ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Mar 05 , 2026 | 01:58 AM