క్యాన్సర్ బాధితుల కోసం చిన్నారి జుట్టు త్యాగం
ABN , Publish Date - May 24 , 2026 | 05:14 AM
హైదరాబాద్ నాగోల్ ప్రాంతానికి చెందిన కొమ్మూరి దినేష్ రెడ్డి, శిరీషా కుమార్తె ఆధ్యా(11) తన పొడవాటి జుట్టును క్యాన్సర్ బాధితులకు ఇచ్చేసింది.
11 ఏళ్ల చిన్నారి ‘ఆధ్యా’ నిర్ణయంపై ప్రశంసలు
మన్సూరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నాగోల్ ప్రాంతానికి చెందిన కొమ్మూరి దినేష్ రెడ్డి, శిరీషా కుమార్తె ఆధ్యా(11) తన పొడవాటి జుట్టును క్యాన్సర్ బాధితులకు ఇచ్చేసింది. క్యాన్సర్‌తో బాధపడే వారికి జుట్టు రాలిపోతుందని, దీంతో బాధిత మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురవుతారని తెలుసుకుంది. బాధితులు విగ్గులు పెట్టుకునేందుకు తన పొడవాటి జుట్టు ఉపయోగపడుతుందని ఆలోచించి గుండు చేయించుకుంది. అనంతరం తన జుట్టును ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా క్యాన్సర్ బాధితులకు అందజేసింది. ఆధ్యా నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.