Share News

డిగ్రీ 30 వేలు.. ఇంటర్‌ 20 వేలు

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:51 AM

నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్న కేటుగాడిని హైదరాబాద్‌ మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డిగ్రీ సర్టిఫికెట్‌ను రూ. 30 వేలకు, ఇంటర్‌ సర్టిఫికెట్‌ను రూ. 20 వేలకు నిరుద్యోగులకు..

డిగ్రీ 30 వేలు.. ఇంటర్‌  20 వేలు

  • నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్న కేటుగాడిని హైదరాబాద్‌ మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డిగ్రీ సర్టిఫికెట్‌ను రూ. 30 వేలకు, ఇంటర్‌ సర్టిఫికెట్‌ను రూ. 20 వేలకు నిరుద్యోగులకు, విదేశాలకు వెళ్లే వారికి అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకుచెందిన 15 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్‌ రషీద్‌ఖాన్‌ (38) సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ దందాకు తెర లేపాడు. విద్యార్హత ఎక్కువగా ఉంటే మంచి ఉద్యోగం, ఆదాయం వస్తుందని నమ్మిస్తూ.. నకిలీ ధ్రువపత్రాలను విక్రయించేవాడు. రషీద్‌ఖాన్‌ దందాపై పక్కా సమాచారంతో నిఘా పెట్టిన మీర్‌చౌక్‌ పోలీసులు.. ఏతేబార్‌ చౌక్‌ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లలో డిగ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోఽథెరపీతో పాటు పది, ఇంటర్‌ బోర్డు సర్టిఫికెట్లు ఉన్నాయని డీసీపీ కారే కిరణ్‌ ప్రభాకర్‌ వెల్లడించారు. దందాలో ఇతడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. ‘నిందితుడు ఎంతమందికి నకిలీసర్టిఫికెట్లు విక్రయించాడు?’ అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 05:52 AM