Share News

31 మంది ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతి

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:05 AM

రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు ఎట్టకేలకు తీపి కబురు అందింది.

31 మంది ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతి

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. హైదరాబాద్‌ జోన్‌ (చార్మినార్‌) పరిధిలో పనిచేస్తున్న 31 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌రెడ్డి ఈ పదోన్నతులను ఖరారు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లకు ఈ అవకాశం దక్కింది.

Updated Date - Mar 24 , 2026 | 05:05 AM