Share News

వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:04 AM

క్యాన్సర్‌, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్‌, వ్యాక్సిన్లు, సెల్‌ అండ్‌ జీన్‌ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా ....

వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్‌

  • పరిశోధన దశ నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు అన్నీ ఒకేచోట: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌/హత్నూర, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్‌, వ్యాక్సిన్లు, సెల్‌ అండ్‌ జీన్‌ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరపట్ల గ్రామంలో రూ.1200 కోట్లతో ఏర్పాటు చేసిన ‘థెరానిమ్‌ బయోలాజిక్స్‌’ ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. పరిశోధన దశ నుంచి వాణిజ్య ఉత్పత్తి దాకా అవసరమైన అన్ని సదుపాయాలను ఒకేచోట కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ప్రపంచ స్థాయి ఎకో సిస్టమ్‌’ను అభివృద్థి చేసేలా సమగ్ర రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి దామోదర మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ఔషధ బయోటేక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సంస్థకు సూచించారు.

Updated Date - Jun 04 , 2026 | 06:04 AM