హైదరాబాద్‌కు సార్‌గాడ్, సీఐబీసీ
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:05 AM
ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, దవోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు-2026లో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపంలోకి....
గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధం.. ఆహార రంగం దిగ్గజం నెస్లే జీసీసీ కూడా..
సీఎం రేవంత్ చొరవతో కార్యరూపంలోకి గ్లోబల్ సమ్మిట్, దవోస్ ఎకనామిక్ ఫోరం ఎంవోయూలు
జూలైలో ప్రారంభం కానున్న సీఐబీసీ జీసీసీ
బలపడనున్న ఫిన్‌టెక్ రంగం.. 2 వేల మందికి ఉపాధి
సార్‌గాడ్ సంస్థ పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏరోస్పేస్, రక్షణ రంగాలకు మరింత ఊతం
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, దవోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు-2026లో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ప్రఖ్యాత విదేశీ సంస్థలు సార్‌గాడ్, సీఐబీసీ హైదరాబాద్‌కు వస్తున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ (జీఐసీ) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఆహార రంగ దిగ్గజం నెస్లే కూడా హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు కోసం సిద్ధమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలు, రాయితీలతో భారీ స్థాయిలో పెట్టుబడులు సాకారమవుతున్నాయి.
సీఐబీసీతో బ్యాంకింగ్ రంగం బలోపేతం
ప్రపంచంలోని బ్యాంకింగ్, ఆర్థిక ేసవల రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన సీఐబీసీ (కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) జూలైలో హైదరాబాద్‌లో తమ జీసీసీని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్, వెల్స్ ఫార్గో, యూబీఎస్, వాంగార్డ్, హెచ్‌ఎ్‌సబీసీ, బార్‌క్ల్లేస్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డాయిచ్ బోర్స్ వంటి ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటికి సీఐబీసీ తోడు అవుతుండటంతో తెలంగాణలో బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగం మరింత బలోపేతం కానుంది. ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థల పెట్టుబడులతో హైదరాబాద్‌కు విశ్వసనీయత పెరిగి, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఎదుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సీఐబీసీ జీసీసీలో రెండు వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేేస అవకాశం ఉందని ఆ కంపెనీ వర్గాల సమాచారం. ముఖ్యంగా బ్యాంకింగ్ టెక్నాలజీ, డిజిటల్ ేసవలు, డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, సైబర్ భద్రత, ఆర్థిక ేసవల నిర్వహణకు సంబంధించి ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, డేటా అనలిటిక్స్ చదివిన యువతకు ఇది మంచి అవకాశమని చెబుతున్నారు.
సార్‌గాడ్‌తో ఏరోస్పేస్ రంగానికి ఊపు
ఏరోస్పేస్, ఆధునిక ఇంజనీరింగ్, తయారీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన ‘సార్‌గాడ్’ సంస్థ కూడా హైదరాబాద్‌లో తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ (జీఐసీ) ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల దవో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు- 2026లో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయి.. తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో జీఐసీ ఏర్పాటుకు సార్‌గాడ్ చర్యలు ప్రారంభించింది. దీంతో హైదరాబాద్ ఏరోస్పేస్, రక్షణ రంగాలకు మరింత ఊపువస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నగరం రక్షణ, అంతరిక్ష సంస్థలకు కేంద్రంగా మారుతోందని పేర్కొంటున్నాయి.
వేగంగా నెస్లే జీసీసీ ఏర్పాటుకు చర్యలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార, పానీయాల సంస్థల్లో ఒకటైన ‘నెస్లే’ కూడా హైదరాబాద్‌ను తమ నూతన కేంద్రంగా ఎంపిక చేసుకుంది. ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించేందుకు వేగంగా చర్యలు చేపట్టినట్టు తెలిసింది. నెస్లే రాకతో ఉద్యోగ అవకాశాలతోపాటు ఆహార ప్రాసెసింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు ప్రయోజనమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బెంగళూరును దాటేసిన హైదరాబాద్!
ఐటీ, ఫార్మా, ఫిన్‌టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ, అంతరిక్ష రంగాల్లో వరుస పెట్టుబడులతో తెలంగాణ ప్రపంచ స్థాయి కంపెనీలకు గమ్యస్థానంగా మారుతోంది. ఒకప్పుడు జీసీసీల ఏర్పాటుకు బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలు, రాయితీలతో పెద్ద కంపెనీలు హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ‘నాస్కామ్-జిన్నోవ్ జీసీసీ ల్యాండ్‌స్కేప్ నివేదిక-2026’ ప్రకారం.. 2025లో భారత్‌లో జీసీసీలను ఏర్పాటు చేసిన ప్రముఖ ఆర్థిక ేసవల సంస్థల్లో 50శాతం హైదరాబాద్‌నే ఎంచుకోవడం గమనార్హం.