IT and Industries Minister Sridhar Babu: ఏఐకి కేరాఫ్‌గా హైదరాబాద్
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:00 AM
కృత్రిమ మేధ సాంకేతికతలో హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా పరుగులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ఏఐని అభివృద్ధి చేసే సంస్థలకు ప్రోత్సాహం: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ సాంకేతికతలో హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా పరుగులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైటెక్‌సిటీలోని ఎయిడెన్ ఏఐ ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రెండేళ్లలో తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎకోసిస్టం వల్ల ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నేడు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఎయిడెన్ ఏఐలో ప్రస్తుతం 500మంది నిపుణులు పనిచేస్తుండగా వచ్చే రెండేళ్లలో మరో 500మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఏఐని అభివృద్ధి చేసే సంస్థలను తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని శ్రీధర్‌బాబు వెల్లడించారు.