Share News

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌పై ముందడుగు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:00 AM

ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌లోని ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ వరకు నిర్మించతలపెట్టిన డబుల్‌ డెక్కర్‌ ...

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌పై ముందడుగు

  • ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి

  • ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.941 కోట్లు

  • 200 కోట్లిచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నారన్న మంత్రి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌లోని ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ వరకు నిర్మించతలపెట్టిన డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సుమారు 7.1 కి.మీ పొడవుతో రూ.941 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.200 కోట్ల భాగస్వామ్యం అందించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. నాగ్‌పూర్‌ తర్వాత దేశంలో చేపట్టే రెండో అతిపెద్ద డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌గా ఇది నిలవనుందని పేర్కొన్నారు. ఈ కారిడార్‌ పూర్తయితే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు వీలైనంత త్వరగా అనుమతులు తెచ్చుకుని, టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.ప్రాజెక్టు డిజైన్‌పై అధికారులు చర్చించారు. అయితే ఒకే వర్క్‌ ఏజెన్సీకి పనులన్నీ అప్పగిేస్త సమన్వయం మెరుగ్గా ఉండి, పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రి సూచనమేరకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ మేనేజర్‌ ఆనంద్‌ మోహన్‌ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కన్సెంట్‌ ఇచ్చేందుకు అంగీకరించారు.

Updated Date - Apr 24 , 2026 | 04:00 AM