దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:11 AM
దివ్యాంగులకు ఉచితంగా సాంకేతిక ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 10 వరకు దరఖాస్తులు: ముత్తినేని
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ఉచితంగా సాంకేతిక ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారికి స్మార్ట్ ఫోన్లు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌ఛైర్లు, ల్యాప్‌టా్‌పలు, ట్యాబ్‌లు అందించనున్నామన్నారు. ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 10 చివరి తేదీగా నిర్ణయించామని వెల్లడించారు. గతంలో దరఖాస్తు చేసుకుని పరికరాలు పొందని వారు సైతం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు మరింత సమాచారం కోసం 9959583502 నంబరును సంప్రదించాలని ఛైర్మన్ వీరయ్య పేర్కొన్నారు.