కాంబోడియా నేరగాళ్లకు భారత సిమ్‌కార్డులు
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:29 AM
అంతర్జాతీయ సైబర్ మోసగాళ్లతో సంబంధం ఉన్న ఐదుగురిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. దేశంలోని వివిధ...
సిమ్‌లు తరలిస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఒకరి పట్టివేత
హైదరాబాద్, శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ సైబర్ మోసగాళ్లతో సంబంధం ఉన్న ఐదుగురిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సిమ్‌కార్డులను ఈ ముఠాకు చెందిన సయ్యద్ అష్రఫ్ కాంబోడియాకు రవాణా చేస్తుండగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకుసమాచారం ఇచ్చినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం తెలిపారు. సయ్యద్ అష్రఫ్ నుంచి 198 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నామని, తమ దర్యాప్తులో ముఠా సభ్యులు గత రెండేళ్లలో 600కి పైగా సిమ్‌కార్డులను విదేశాల్లోని సైబర్ నేరగాళ్ల ముఠాలకు అప్పగించినట్లు వెల్లడైందని ఆమె తెలిపారు.