హైదరాబాద్‌లో కాల్‌సెంటర్.. విదేశాల్లో మకాం
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:57 AM
అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది రూపాయల సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.
కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు అరెస్ట్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 4 (ఆంధజ్ర్యోతి): అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది రూపాయల సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా లింగాల మండలానికి చెందిన దేవరపల్లి పట్టాభి కొంతకాలంగా విదేశాల్లో ఉంటూ భారీ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో పట్టాభి మొదట హైటెక్ సిటీలో ఒక కాల్‌సెంటర్ ఏర్పాటు చేశా డు. దీని ద్వారా విదేశాల్లో ఉన్న వారికి ఫోన్లు చేయించి.. ‘‘మీ కంప్యూటర్ హ్యాక్ అయింది. యాంటీ వైరస్ సాప్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాం’’ అని నమ్మించి, ఏపీకే ఫైల్ పంపి వారి సిస్టమ్‌లను హ్యాక్ చేసి కోట్లు వసూలు చేసేవాడు. పట్టాభి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినట్టు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు అప్రమత్తమై.. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.