వృద్ధ తల్లిదండ్రులకు వేధింపులు
ABN , Publish Date - May 23 , 2026 | 05:10 AM
వృద్ధులైన తల్లిదండ్రులను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న కుమారుడికి న్యాయస్థానం 60 రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది.
కుమారుడికి 60 రోజుల జైలు, రూ.500 జరిమానా
హైదరాబాద్ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): వృద్ధులైన తల్లిదండ్రులను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న కుమారుడికి న్యాయస్థానం 60 రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. నారాయణగూడకి చెందిన జి.శ్రీనివాస్ (44) ప్రైవేటు ఉద్యోగి. వృద్ధులైన తల్లిదండ్రులను నిరాదరించడంతో పాటు దూషిస్తూ వారిపై దాడి చేసేవాడు. తట్టుకోలేని బాధితులు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై జె.శ్రీకాంత్‌రెడ్డి దర్యాప్తు చేసి ఆధారాలను కోర్టులో సమర్పించారు. కేసును పరిశీలించిన నాంపల్లి ఐదో స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎం. భాస్కర్.. నిందితుడు శ్రీనివా్‌సకు శుక్రవారం శిక్ష విధించారు. వయో పౌరుల భద్రతకు ప్రాధాన్యమిస్తామని, తల్లిదండ్రులను వేధించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.