హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో..ఎగిరేది గులాబీ జెండానే
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:04 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కార్పొరేషన్లు చేసినా.. హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఆ రెండు జాతీయ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కార్పొరేషన్లు చేసినా.. హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన విజయ్‌కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు బీఆర్‌ఎ్‌సలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని, అది పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. ఆ రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.