‘సర్’ విధుల్లో ఉన్న మహిళా బీఎల్‌వోలపై దాడి
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:18 AM
ఎస్‌ఐఆర్ ప్రక్రియ విధుల్లో ఉన్న బూత్ లెవల్ ఆఫీసర్ మహిళా సిబ్బందిపై దాడి చేసి, వారి విధులకు ఆటంకం కలిగించిన నలుగురు బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదైంది.
బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురిపై కేసు నమోదు
బంజారాహిల్స్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియ విధుల్లో ఉన్న బూత్ లెవల్ ఆఫీసర్ మహిళా సిబ్బందిపై దాడి చేసి, వారి విధులకు ఆటంకం కలిగించిన నలుగురు బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నం.12 ఎన్‌బీటీ నగర్‌కు చెందిన చెందిన పిట్ల సంధ్య జీహెచ్‌ఎంసీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సోమవారం ఎన్‌బీటీ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆమె విధుల్లో ఉండగా బీఆర్‌ఎస్‌కు చెందిన జోజుల రాజు, రజిత, శంకరమ్మ, నర్సింహలు అక్కడకు వచ్చి.. తాము చెప్పిన వారికే ఫారాలి వ్వాలంటూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. ‘మా మాట వినకపోతే మీరు ఎలా పనిచేస్తారో చూస్తాం’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగకుండా బీఎల్‌వో సంధ్యతో పాటు ఆమె సహోద్యోగి దేవిపై దాడి చేశారు. దీనిపై బీఎల్‌వోలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం కూడా వారు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.