Share News

గ్లోబల్‌ వ్యాల్యూ క్రియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:15 AM

ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ కేర్‌, ఏరో స్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫిన్‌టెక్‌, డీప్‌టెక్‌, రిటైల్‌ తదితర రంగాల్లోనూ హైదరాబాద్‌ను....

గ్లోబల్‌ వ్యాల్యూ క్రియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌

  • ‘ది హార్ట్‌ఫోర్డ్‌ ఇండియా టెక్నాలజీ సెంటర్‌’ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ కేర్‌, ఏరో స్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫిన్‌టెక్‌, డీప్‌టెక్‌, రిటైల్‌ తదితర రంగాల్లోనూ హైదరాబాద్‌ను ‘గ్లోబల్‌ వ్యాల్యూ క్రియేషన్‌ హబ్‌’గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. అందుకోసం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టు వర్క్‌ ఫోర్స్‌’గా తీర్చిదిద్దడంపై, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సోమవారం నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లో అంతర్జాతీయ బీమా దిగ్గజం హార్ట్‌ ఫోర్డ్‌ 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1200 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ‘ది హార్ట్‌ఫోర్డ్‌ ఇండియా టెక్నాలజీ సెంటర్‌’ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా రెండు శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన హార్ట్‌ఫోర్డ్‌.. హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం ఇక్కడి ప్రతిభకు, డిజిటల్‌ ఇంజనీరింగ్‌లో మన నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ, రిస్క్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆధునిక బీమా రంగంలో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మరింత పెరుగుతుందన్నారు. నగరంలో ఇప్పటికే 400కు పైగా గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు(జీసీసీ) సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో మారియట్‌, మెక్‌డొనాల్డ్స్‌, యూబీఎస్‌, డాజన్‌, వాన్‌గార్డ్‌, ఎలీ లిల్లీ, హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌, సిటిజన్స్‌ బ్యాంక్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు. వీటిని కేవలం బ్యాక్‌ ఎండ్‌ ఆపరేషన్స్‌కు మాత్రమే పరిమి తం చేయకుండా.. గ్లోబల్‌ వ్యాల్యూ సెంటర్లుగా మార్చేలా అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. తాజాగా ప్రారంభించిన ఈ కార్యాలయం అమెరికాలోనిహార్ట్‌ఫోర్డ్‌, షికాగో, షార్లెట్‌, కొలంబస్‌లో ఉన్న టెక్నాలజీ కేంద్రాలకు అనుబంధంగా పని చేస్తూ.. ఏఐ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ డెవలె్‌పమెంట్‌పై దృష్టి సారిస్తూ ‘ఇంజనీరింగ్‌ ఎక్సలెన్స్‌ హబ్‌’గా వ్యవహరిస్తుందని అన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 05:15 AM