సినీ జూనియర్ ఆర్టిస్టులతో గంజాయి స్మగ్లింగ్
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:06 AM
ఇన్నాళ్లూ నిరుద్యోగులకు నెల జీతాలు ఇచ్చి వారిని గంజాయి ట్రాన్స్‌పోర్టర్లుగా వినియోగించుకున్న మత్తుపదార్థాల ముఠాలు.. ఇప్పుడు సినిమా...
2 కోట్ల విలువైన 2.15కిలోల గంజాయితో దొరికిన మహిళ
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ నిరుద్యోగులకు నెల జీతాలు ఇచ్చి వారిని గంజాయి ట్రాన్స్‌పోర్టర్లుగా వినియోగించుకున్న మత్తుపదార్థాల ముఠాలు.. ఇప్పుడు సినిమా జూనియర్ ఆర్టిస్టులను గంజాయి రవాణాకు వాడుకుంటున్నాయి. సినీ రంగానికి చెందిన కొందరు సినిమా షూటింగ్‌లు లేకపోయినా తరచూ బ్యాంకాక్ వెళ్లి వస్తుండడంపై ఈగల్ టీమ్ నిఘా పెట్టడంతో ఈ విషయం బయటపడింది. ఎలాంటి ఉద్యోగం, ఉపాధి లేకుండా ఆన్ అరైవల్ వీసాతో తరచూ బ్యాంకాక్ వెళ్లివస్తున్న ప్రయాణికులను కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల సహయంతో ఈగల్ బృందం జల్లెడ పట్టింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన దొడ్డి సూరికళ అనే సినీ జూనియర్ ఆర్టిస్టును కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని పరిశీలించగా రూ.2కోట్ల విలువైన 2.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి దొరికిందని ఈగల్ బృందాలు తెలిపాయి.