Share News

హుజూరాబాద్‌ కౌంటింగ్‌లో హైడ్రామా

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:37 AM

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల వేళ శుక్రవారం ఆసక్తికరమైన ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రంలో...

హుజూరాబాద్‌ కౌంటింగ్‌లో హైడ్రామా

  • స్ట్రాంగ్‌ రూం తాళంచెవి మరిచిపోయిన మునిసిపల్‌ సిబ్బంది

  • గునపంతో తలుపు పగలగొట్టిన అధికారులు

హుజూరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల వేళ శుక్రవారం ఆసక్తికరమైన ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఉదయం స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. అయితే సిబ్బంది అజాగ్రత్త వల్ల ఆ గదికి సంబంధించిన తాళం చెవి కనిపించలేదు. ఎంతవెతికినా లభించకపోవడంతో కౌంటింగ్‌కు ఆటంకం ఏర్పడింది. దీంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని భావించిన అధికారులు.. చేసేదిలేక గునపంతో స్ర్టాంగ్‌ రూం తాళాన్ని పగలగొట్టి తలుపులు తెరిచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 14 , 2026 | 04:37 AM