Share News

చైర్‌పర్సన్‌గా భార్య.. వైస్‌ చైర్మన్‌గా భర్త

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:58 AM

ఎన్నికల్లో భార్యా భర్తలు ఒకేసారి గెలవడమే విశేషం. అందులోనూ దంపతులిద్దరికీ చైర్మన్‌ పీఠం దక్కితే..

చైర్‌పర్సన్‌గా భార్య.. వైస్‌ చైర్మన్‌గా భర్త

అశ్వారావుపేట, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో భార్యా భర్తలు ఒకేసారి గెలవడమే విశేషం. అందులోనూ దంపతులిద్దరికీ చైర్మన్‌ పీఠం దక్కితే.. అశ్వారావుపేటలో అదే జరిగింది. 22 వార్డులున్న అశ్వారావుపేట మునిపాలిటీలో 17 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలో సోమవారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ తరఫున ఆరో వార్డు నుంచి గెలిచిన జూపల్లి శశికళను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసిన అధిష్ఠానం.. 13వ వార్డు నుంచి కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన శశికళ భర్త జూపల్లి రమేశ్‌ బాబును వైస్‌ చైర్మన్‌గా ఎంపిక చేసింది. అశ్వారావుపేట చైర్‌పర్సన్‌గా జూపల్లి శశికళ ఉండబోతున్నారంటూ కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్యానల్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముందే ప్రకటించారు. ఆ మేరకు ఎమ్మెల్యేతో పాటు శశికళ భర్త రమేశ్‌ బాబు అన్నీ తామై ఎన్నికల ప్రచారం చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన రమేశ్‌.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు.

Updated Date - Feb 17 , 2026 | 06:59 AM