రామగుండంలో భార్యాభర్తల విజయం
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:50 AM
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భార్య భర్తలు విజయం సాధించారు. 58వ డివిజన్ బీఆర్‌ఎస్...
కోల్‌సిటీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భార్య భర్తలు విజయం సాధించారు. 58వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మేకల సమ్మయ్యయాదవ్, 60వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆయన భార్య మేకల శారదలు గెలుపొందారు. పక్కపక్కనే ఉండే అడ్డగుంటపల్లి, పాత మునిసిపల్ ఏరియా, మారుతినగర్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూఈ దంపతులు గెలవడం విశేషం.