Share News

kumaram bheem asifabad- హంగ్‌.. ఎవరు కింగ్‌..?

ABN , Publish Date - Feb 14 , 2026 | 09:58 PM

హంగ్‌ ఫలితాలు వచ్చిన రెండు మున్సిపాలిటీల్లో రాజకీయం రసకందాయంగా మారింది. మున్సిపాలి టీలను దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకు ల ప్రయ త్నాలతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

kumaram bheem asifabad- హంగ్‌.. ఎవరు కింగ్‌..?
లోగో

- రసకందాయంలో రాజకీయం

- కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులు

- పాగా వేసేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు

- ఎక్స్‌అఫీషియో ఓట్లపై ఈసీ కొత్త మార్గదర్శకాలు

హంగ్‌ ఫలితాలు వచ్చిన రెండు మున్సిపాలిటీల్లో రాజకీయం రసకందాయంగా మారింది. మున్సిపాలి టీలను దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకు ల ప్రయ త్నాలతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మున్సి పల్‌ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత జిల్లా లో రాజకీయ వేడి కొనసాగుతోంది. చైర్మన్‌ పీఠాలను కైవసం చేసు కునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎంపిక జరుగనున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహప్రతి వ్యూహల్లో మునిగిపోయాయి. తెలంగాణ మున్సిపాలి టీ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఈనెల 16న ఉదయం 11 గంటలకు గెలుపొందిన వార్డు కౌన్సిలర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్‌ ఎన్నిక ఆ తర్వాత వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఇందు కోసం సంబందిత మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం సభ్యుల్లో కనీసం సగం మందికి పైగా హాజరు కావాల్సి ఉంటుంది. సంబందిత చైర్మన్‌ పద వికి కేటాయించిన రిజర్వేషన్‌ వర్తించే వార్డు కౌన్సిల ర్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. పోటీలో ఉన్నవారికి మద్దతుగా చేతులు ఎత్తే విధా నం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థుల కు సమానంగా ఓట్లు వస్తే లాటరీ(డ్రా) ద్వారా విజేతను నిర్ణయిస్తారు. జిల్లాలోని రెండు మున్సిపా లిటీల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆసిఫాబాద్‌ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవి బీసీ- మహి ళకు కేటాయించారు. ఇందు కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి.

- స్పష్టమైన మెజార్టీ లేక పోవడంతో..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ల్లో ఏ పార్టీకి చైర్మన్‌ పదవి గెలుచుకునేందుకు స్పష్టమైన మెజార్టీ లేదు. రెండు మున్సిపాలిటీ ల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. చైర్మన్‌ పదవి ఎంపిక కోసం స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా కాంగ్రెస్‌ 7 స్థానాల్లో, బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఇక్కడ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకొవాలంటే స్వతంత్రుల మద్దతు తప్పనిసరి. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ 9 స్థానా ల్లో బీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, స్వతంత్రులు 4 స్థానాల్లో ఎంఐ ఎం ఒక స్థానంలో గెలుపొందారు. ఇక్కడ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకొవాలంటే స్వతంత్రులతో పాటు ఇతర పార్టీల మద్దతు తప్పనిసరిగా మారిం ది. రెండు మున్సిపాలిటీల్లో ఇంచుమించు ఒకే పరి స్థితి ఉండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఎలగైనా చైర్మన్‌ పీఠం దక్కించుకొవడా నికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

- ఈసీ కొత్త మార్గదర్శకాలు..

మున్సిపల్‌ చైర్మన్‌ ఎంపికలో అత్యంత కీలకమైన ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటుహక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియోగా సభ్యులుగా ఓటు వేయలంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్ట ర్లకు ఎన్నికల అధికారులకు సర్క్యులర్‌ జారీ చేసిం ది. గతంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రం లోని ఎక్కడైనా తమకు నచ్చిన లేదా అవసరమున్న చోట ఓటు వేసే వెసులుబాటు ఉండేది. కానీ తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శ కాల ప్రకారం స్థానికంగా ఓటు లేకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం నిబంధనలకు విరు ద్దమని స్పష్టం చేసింది. దీంతో జిల్లా లో సమీకరణా లు మారనున్నాయి. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలలో హంగ్‌ ఏర్పడడంతో ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. తాజాగా ఎన్ని కల సంఘం నిబంధనలతో స్థానికంగా ఓటులేని ప్రజాప్రతినిధులు తమ ఓటును వినియోగించుకోలే రు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఎక్స్‌అఫీషియోగా ఓటు వర్తిస్తుండగా ఎమ్మెల్సీ దండె విఠల్‌ గతంలో బీఆర్‌ఎస్‌ తరపున గెలవడంతో అయనకు కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్‌ తరపున ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఇతర జిల్లాల్లోని ఎమ్మె ల్సీ, ఎంపీలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తు న్న క్రమంలో ఈసీ విడుదల చేసిన తాజా ఉత్తర్వు లతో వారి ఆశలు గల్లంతయ్యాయి.

Updated Date - Feb 14 , 2026 | 09:58 PM