మానవ విలువలు పెంపొందించాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:35 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధనతో పాటు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొం దించేలా ఉపాధ్యాయులు కృషి చే యాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచ కుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.
- జాతీయ హిందీ దినోత్సవంలో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్, సెప్టెంబ రు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధనతో పాటు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొం దించేలా ఉపాధ్యాయులు కృషి చే యాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచ కుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని వెలమ ఫంక్షన్‌హాలులో రికగ్నైజ్డ్ ఉపా ధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం (ఆర్‌యూపీపీటీఎస్) ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ అధ్య క్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డితో పాటు డీఈవో రమేశ్‌కుమార్ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ద డంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలక మని అన్నారు. అనంతరం హిందీ సబ్జెక్టులో అ త్యుత్తమ ప్రతీభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే, డీఈవో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. తదనంతరం విద్యార్థులు సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్ర మంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, హిందీ ఉపాధ్యాయులు, పండితులు పాల్గొన్నారు.