Share News

నాగర్‌కర్నూల్‌ ఘటనపై హక్కుల కమిషన్‌ ఆరా

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:26 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసికందు మరణం, దళిత కుటుంబ సభ్యులపై దాడి ఘటనలకు సంబంధించి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని...

నాగర్‌కర్నూల్‌ ఘటనపై హక్కుల కమిషన్‌ ఆరా

  • 24లోగా నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు

హైదరాబాద్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసికందు మరణం, దళిత కుటుంబ సభ్యులపై దాడి ఘటనలకు సంబంధించి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ప్రతినిధులు గురువారం ఆయన్ను కలిసి నిందితులను అరెస్టు చేయడంలో స్థానిక పోలీసులు సక్రమంగా వ్యవహరించడం లేదని ఫిర్యాదు చేశారు. దాంతో ఈ నెల 24లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని కమిషన్‌ ఆదేశించింది.

Updated Date - Mar 06 , 2026 | 03:27 AM