యాదగిరి దుస్థితిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:01 AM
పేద విద్యార్థులు చెల్లించే గురుకుల ప్రవేశ పరీక్ష ఫీజులను ఉన్నత హోదాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులే గౌరవ వేతనం పేరుతో పంచుకుంటున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.....
నివేదిక సమర్పించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు ఆదేశం
ఆంధ్రజ్యోతి కథనంతో కమిషన్ సుమోటో కేసు, విచారణ
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, యదాద్రి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు ఉంగరాల యాదగిరి ఎదుర్కొంటున్న దుస్థితిపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం (టీజీహెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ‘రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడి’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో సోమవారం ప్రచురితమైన కథనం ఆధారంగా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. హెచ్‌ఆర్‌సీ చైర్మన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన విచారణ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేశిపల్లికి చెందిన 110ఏళ్ల ఉంగరాల యాదగిరి.. తన కుమారుల నిర్లక్ష్యం, వేధింపుల కారణంగా ప్రస్తుతం ఉప్పల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన దుస్థితిపై పూర్తి వివరాలతో వెంటనే నివేదిక సమర్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కమిషన్ ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.