Share News

భక్తితోనే మానవ జన్మకు సార్థకత

ABN , Publish Date - May 03 , 2026 | 11:28 PM

ప్రతీ ఒక్కరు భక్తిభావాన్ని పెంచుకుని మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

భక్తితోనే మానవ జన్మకు సార్థకత
కొట్ర కంఠమేశ్వరస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే నారాయణరెడ్డి

వెల్దండ, మే 3 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరు భక్తిభావాన్ని పెంచుకుని మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మించినకంఠమేశ్వరస్వామి, సూరమాంబ, రేణుకాఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, గణపతి దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమి షన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, టాస్క్‌ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, సీసీబీ సభ్యుడు బాలాజీసింగ్‌లు వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాలలో ఎంతో ఆధ్యాత్మికంగా దేవాలయాల నిర్మాణాలు చేపట్టడం అభినందనీయని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శారద, భూపతిరెడ్డి, హరికిషన్‌ నాయక్‌, సంజీవ్‌కుమార్‌, ఆనంద్‌కుమార్‌, శేఖర్‌రెడ్డి, బాలస్వామి, నాగరాజుగౌడ్‌, జంగయ్య, రాములు ఉన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:28 PM