Share News

మహాలక్ష్మి పథకంతో మహిళలకు భారీ ఆదాయం

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:33 PM

మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు సుమారు రూ. 10కోట్ల వరకు ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.

మహాలక్ష్మి పథకంతో మహిళలకు భారీ ఆదాయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు సుమారు రూ. 10కోట్ల వరకు ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం మహిళల ప్రయాణం సులభమైందని, కుటుంబ ఆర్థిక భారం కొంత మేర తగ్గిందని అన్నారు. మహి ళా సాధికారతకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వే స్తుందన్నారు. కార్యక్రమంలో డీఎం, నాయకులు, ప్రయాణికులు, కార్మికులు పాల్గొన్నారు.

వేసవిలో తాగునీరు పోసినా పుణ్యమే

అచ్చంపేటటౌన్‌, (ఆంధ్రజ్యోతి) : వేసవిలో తాగునీరు పోసినా పుణ్యమే వస్తుందని ఎమ్మె ల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సేవా కార్యక్ర మాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమ న్నారు. ఈ కార్యక్రమంలో రక్షిత మహిళా సం ఘం సభ్యురాలు జయమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:33 PM