న్యాయవాది హత్యకేసు..డీజీపీ నివేదిక కోరిన హెచ్‌ఆర్సీ
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:34 AM
న్యాయవాది స్వప్న కుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) సీరియస్ అయింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): న్యాయవాది స్వప్న కుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) సీరియస్ అయింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, మార్చి 6లోగా సమగ్ర నివేదిక అందజేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని హెచ్‌ఆర్సీ చైౖర్మన్ డా.షమీమ్ అక్తర్ ఆదేశించారు. భూ వివాదంలో ఈనెల 4న స్వప్న కుమారి దారుణ హత్యకు గురయ్యారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే స్వప్న కుమారి ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తు 163 మంది న్యాయవాదులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. బాధ్యులైన పోలీసులపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం కింద చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారంపై డీజీపీ వివరణ ఇవ్వాలని హెచ్‌ఆర్సీ స్పష్టం చేసింది.