పిల్లలూ భోజనం ఎలా ఉంది
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:49 PM
పిల్లలూ భోజనం ఎలా ఉం ది. మీ ఇంట్లో చేసినట్టుగానే రుచిగా ఉందా అంటూ కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం మండలంలోని నీల్వాయి కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయాన్ని, వేమనపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
ఫవిద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి..
ఫవివరాలు తెలుసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్
వేమనపల్లి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : పిల్లలూ భోజనం ఎలా ఉం ది. మీ ఇంట్లో చేసినట్టుగానే రుచిగా ఉందా అంటూ కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం మండలంలోని నీల్వాయి కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయాన్ని, వేమనపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నా రు. నీల్వాయిలోని కస్తూర్బా విద్యాలయంలో అదనపు తరగతి గదు ల నిర్మాణ పనులను, వంటశాలను పరిశీలించారు. విద్యార్థినుల సౌ కర్యాలపై ప్రత్యేకాధికారిణి మయూరిని వివరాలు అడిగి తెలుసుకు న్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అ వసరమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మూత్రశాలలు తదితర సౌక ర్యాలను కల్పించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూ పాలన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిం చాలన్నారు. వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలోని వంట శాల, భోజనశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. తరగతిలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని తె లిపారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుం టే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను నీల్వాయి సర్పంచు సమ్మయ్య శాలువాతో సన్మానించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో కుమారస్వామి, నీల్వాయి సర్పంచు చెన్నూరి సమ్మ య్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్, ఉపసర్పంచు కాయిత శోభ, ఉపాధ్యాయులు గ్రామస్థులు పూర్ణచందర్‌రెడ్డి ఉన్నారు.