ప్లాస్టిక్ కట్టడి ఎలా...?
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:16 PM
మంచి ర్యాల నగర పాలక సంస్థ పరిధిలో ప్రతీ రోజు చెత్త సేకరణ లో సగానికంటే ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులే లభిస్తున్నాయి.
-విచ్చల విడిగా కవర్లు, వస్తువులు వినియోగం
-నియంత్రించడంలో మున్సిపాలిటీల నిర్లక్ష్యం
-నిబంధనలను విస్మరిస్తున్న వ్యాపారులు
-గతంలో తనిఖీ అధికారులపై వ్యాపారి దాడి
మంచిర్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల నగర పాలక సంస్థ పరిధిలో ప్రతీ రోజు చెత్త సేకరణ లో సగానికంటే ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులే లభిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం ద్వారా అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని ప్రజలకు తెలిసినప్పటికీ అనివార్యంగా ప్లాస్టి క్ కవర్లు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన వస్త్తువులను వాడు తున్నారు. తద్వారా ప్రజలు క్యాన్సర్‌తో పాటు పలు దీర్ఘకా లిక వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం...పరిణామాలపై ఇటీవల ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్ర ణాళిక కార్యక్రమంలో భాగంగా పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కేంధ్రంలోని ఓ డీఈడీ కళాశాలలో వి ద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అయితే కేవలం అవగాహన కార్యక్రమాలనే కాకుండా వ్యాపార సం స్థల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, భారీ మొత్తంలో జరి మానాలు విధిస్తే తప్ప....ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యపడదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా...
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్‌లలో పదుల సంఖ్యలో హోల్‌సేల్ ప్లాస్టిక్ విక్ర యషాపులు ఉన్నాయి. వాటి నిర్వాహకులు ప్రభుత్వ నిబం ధనల ప్రకారం 120 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ కవ ర్లను మాత్రమే విక్రయించాలి. కానీ కొందరు వ్యాపారులు 120 మైక్రాన్ల మందం ఉన్నట్లు నకిలీ ముద్రను వేసి మరీ కవర్లు యథేచ్చగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరి కొందరు బల్దియా సిబ్బంది, రాజకీయ నేతల అండ దండలతో ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతీ రోజు మంచిర్యాల నగరం నుంచి దాదాపు వంద టన్నుల ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నా... అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు విమర్శలు వస్తున్నాయి.
ఆగని వినియోగం....
మంచిర్యాల నగరంలోని మార్కెట్ రోడ్, స్టేషన్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్డులో ఉన్న హోల్‌సేల్ షాపులలో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలతో పాటు బార్లు, రెస్టారెంట్లు, మ టన్ షాపులు, చికెన్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కూ రగాయల విక్రయ వ్యాపారులకు, కిరాణ షాపులకు సప్లయి ఆవుతున్నాయి. అడ్డగోలుగా ప్లాస్టిక్ దందా జరుగుతున్నా.... అధికారులెవరూ కన్నెత్తి చూడక పోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బల్దియాల సిబ్బంది ఆ యా హోల్‌సేల్ దుకాణాలలో మామూళ్లు వసూలు చేస్తు న్నారన్న అభియోగాలు సైతం ఉన్నాయి. సింగిల్ యూజ్ బ్యాగులు వాడాలని సిబ్బంది అవగాహన కల్పించకపోవ డంతో ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా మారింది. గతంలో జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిశేధం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేవారు. దుకాణాలలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, భారీగా ఫైన్‌లు వేయడం ద్వారా ప్లాస్టిక్ వాడకంపై ఉక్కు పాదం మోపేవారు. దీంతో అపట్లో కొంత మేరకు నియం త్రణ జరిగింది. అప్పటి అధికారులు, సిబ్బందికి బదిలీలు కావడంతో తనిఖీలు నిలిచిపోయాయి. దీంతో పరిస్థితి ఎప్పటిలాగే తయారైంది.
సానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై వ్యాపారి దాడి....
ప్లాస్టిక్ తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ హోల్ సేల్ దుకాణానికి వెళ్లిన మున్సిపల్ అధికారిపై దాడి జరి గిన సంఘటన 2020 డిసెంబరు 7న చోటు చేసుకుంది. స్వచ్చ సర్వేక్షన్ 20-2021లో భాగంగా స్థానిక శ్రీనివాస టా కీస్ రోడ్డులోగల ఓ ప్లాస్టిక్ షాపులో అప్పటి సానిటర్ ఇన్ స్పెక్టర్ శ్యాంసుందర్, జవాను కుంటాల రాజలింగుల నేతృ త్వంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తం లో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు లభించడంతో కూపీ లాగిన సిబ్బంది షాపు వెనకాల ఉన్న మరో బిల్డింగులో మరింత స్టాకు ఉందని తెలుసుకున్నారు. దీంతో వారు అక్కడికి వెళ్ల గా షాపు యజమాని సిబ్బందిని దుర్భాషలాడుతూ సాని టరీ ఇన్‌స్పెక్టర్‌తోపాటు జవానునుపై భౌతికదాడికి పాల్ప డ్డాడు. అంతటితో ఆగకుండా వ్యాపారి బూతులు తిడుతూ ఇద్దరిపై మళ్లీ దాడికి యత్నించాడు. దీంతో వెనుదిరిగి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాడికి పాల్పడ్డ వ్యాపారిపై ఫిర్యాదు కూడా చేశారు.
తీవ్ర పరిణామాలు ఉంటాయి....మంచిర్యాల కమిషనర్ అన్వేష్
నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు అ నుగుణంగా ప్లాస్టిక్ నిరోధానికి చర్యలు చేపడతాం. ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపార సంస్థలు, వినియోగదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తక్షణమే నిలిపివేయాలి. ఈ విషయమై ఇకమీ దట ముమ్మర తనిఖీలు నిర్వహిస్తాం. బల్దియా పరిధిలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ప్లాస్టిక్ వస్తువులు, కవ ర్లు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడం.