Share News

ఫిరాయింపులు ఆపేదెలా....?

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:38 PM

ముని సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని వివిధ పార్టీల్లోకి వలసలు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా బీజీపీ, బీఆర్‌ఎస్‌లో ఈ పరిస్థితి అత్యంత అధికంగా ఉంది. వలసవాదులను తమ పార్టీలో చేర్చుకోవడమే ప్రధాన ఎజెండాగా ఆ రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నా రు.

ఫిరాయింపులు ఆపేదెలా....?

-టికెట్ల కోసం పోటాపోటీగా పార్టీల మార్పు

-వలసలను ప్రోత్సహిస్తున్న ప్రధాన పార్టీలు

-మునిసిపల్‌ ఎన్నికల వేళ నేతలకు పరేషాన్‌

-టికెట్ల కేటాయింపులో వలసవాదులకే ప్రాధాన్యం

-పార్టీనే నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయమే

మంచిర్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ముని సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని వివిధ పార్టీల్లోకి వలసలు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా బీజీపీ, బీఆర్‌ఎస్‌లో ఈ పరిస్థితి అత్యంత అధికంగా ఉంది. వలసవాదులను తమ పార్టీలో చేర్చుకోవడమే ప్రధాన ఎజెండాగా ఆ రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నా రు. కాంగ్రెస్‌లో టికెట్ల కోసం బారులు తీరుతుండగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అభ్యర్థుల కోసం వేట ప్రారంభిం చాయి. టికెట్లు ఇస్తామన్న హామీతోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో టికెట్లు ఆశించే వారిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. మొద టి నుంచి పార్టీనే నమ్ముకుని పని చేసిన పాత వారిని పక్కన బెట్టి తమకే టికెట్‌ కావాలంటూ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ అభివృద్ది కోసం పైసా ఖర్చు పెట్టకుండా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించని వా రు తమకు మునిసిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌/ కౌన్సి లర్‌ టికెట్లు కావాలని తిరుగుతున్నారు. గతంలో అధి కారంలో ఉన్న పార్టీతో లబ్ది పొందిన వారు సైతం నేడు అధికారంలో ఉన్న పార్టీలో చేరి తమ పబ్బం గ డుపుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకొని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి కోసం కృషి చేసినవారు మునిసిపల్‌ ఎన్నికల్లో టికెట్లు దొరకని స్థితిలో పక్కకు జరగాల్సిన దయనీయ పరిస్థితులు నె లకొన్నాయి. ఈ విషయంలో వివిధ నియోజక వర్గాల కు చెందిన ముఖ్య నేతలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాత క్యాడర్‌ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన వలసలు...

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాం గ్రెస్‌లోకి వలసలు విపరీతంగా పెరిగాయి. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లుగా ఉన్న అనేక మంది మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మె ల్యేలుగా కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద, గడ్డం వినోద్‌లు గెలుపొందడంతో పెద్ద సంఖ్యలో కాం గ్రెస్‌ కండువా కప్పుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం వివేకానంద శాసనసభ ఎన్నికలకు ముందే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ యనతోపాటే పెద్ద మొత్తంలో అనుచర వర్గం కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంది. అలాగే బెల్లంపల్లి ఎమ్మె ల్యే వినోద్‌ సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాం గ్రెస్‌లో చేరారు. ఆయన అనుచర వర్గం కూడా పార్టీ మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2018 ఎ న్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ ఆయన పార్టీ మారలేదు. మొదటి నుంచి ఆయన పార్టీని అంటిపె ట్టుకుని దాని అభివృద్ధికి కృషి చేశారు. ఆయనతోపాటే పాత క్యాడర్‌ కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీలు మారిన నాయకు లు ప్రస్తుతం మునిసిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ రేసులో ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్‌ జెండాలు మోసి, పార్టీ అభివృద్ధి కోసం పాటు పడిన వారికి టికెట్లు కేటా యింపుల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ప్రచా రం జరుగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో పాత క్యాడర్‌ తోపాటు కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం టికెట్‌ ఆ శిస్తున్నారు. అయితే పాత క్యాడర్‌ పటిష్టంగా ఉన్న ప్పటికీ కొన్ని చోట్లా వారిని కాదని, వలస వచ్చిన వా రికి టికెట్లు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచా రం జరుగుతోంది. దీంతో ఇంతకాలం టికెట్‌ వస్తుందని ఆశతో ఉన్నవారు తీవ్ర మనస్థాపానికి గురై ఇతర పా ర్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలోకి పెరుగుతున్న వలసలు...

మునిసిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీ జేపీలో వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ము ఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్‌లో ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతున్నారు. ముఖ్యం గా బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కౌన్సిలర్లు బీజేపీలో చే రడం పట్ల ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర ఆందోళన నెల కొంది. రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ మాజీ కౌన్సిలర్లు బొట్ల సత్యనారాయణ, అంకం మనోజ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత మునిసిపల్‌ ఎన్నికల్లో బొట్ల సత్యనారాయణకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారు కూడా చేసింది. ఇంతలోనే ఆయన పార్టీ మారడం తీవ్ర చర్చ నీయాంశం అవుతోంది. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్‌ జి ల్లాస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి బొట్ల సత్య నారాయణకు ఆహ్వానం అందకపోవడంతోనే ఆయన మనస్థాపంతో పార్టీ మారాడనే ప్రచారం జరుగుతోం ది. ఇదే మాదిరిగా కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని వారం తా బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలు స్తోంది. వలసల కారణంగా బీజేపీలో క్రమంగా బెర్త్‌లు నిండుతుండగా, బీఆర్‌ఎస్‌ మాత్రం అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల వేళ ఊపందుకున్న వలసలతో ఆయా పార్టీల నేతలు పరేషాన్‌లో ఉన్నారు. వలసవాదుల కారణంగా ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూప నుండటంతో, వలసలను అడ్డుకోవడం కోసం అసంతృ ప్తులను బుజ్జగించే పనిలో ముఖ్య నేతలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 25 , 2026 | 11:38 PM