ధాన్యం దించేదెలా..?
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:23 PM
మంచిర్యాల జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి కొనుగోలు కేంధ్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడంలో సం బంధిత అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.
-సీఎంఆర్ బకాయిలతో డిఫాల్టర్లుగా రైస్ మిల్లర్లు
-గోదాముల్లో వేధిస్తున్న స్థలం కొరత
-ఇతర జిల్లాలకు తరలించడంలో తప్పని ఇబ్బందులు
-ధూరభారంతో పెరగనున్న ట్రాన్స్‌పోర్టేషన్ చార్జీలు
-గత ప్రభుత్వ హయాంలోనే డిఫాల్టర్లుగా మిల్లర్లు
మంచిర్యాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి కొనుగోలు కేంధ్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడంలో సం బంధిత అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఓ వైపు ధాన్యం కొనుగోలు సమయం సమీ పిం చడం, కల్లాల్లో ఇప్పటికీ ధాన్యం రాశులు నిల్వ ఉం డటం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చే స్తోంది. గతంలో సీఎమ్మార్ (కస్టం మిల్లింగ్ రైస్) కింద ధాన్యం పొందిన మిల్లర్లు పెద్ద మొత్తంలో వా టిని పక్కదారి పట్టించగా, పరిశీలించిన జిల్లా ఉన్న తాధికారులు సంబంధిత రైస్ మిల్లులపై క్రిమినల్ కే సులు నమోదు చేశారు. గత సంవత్సరం నుంచి కే సులు ఎదుర్కొంటున్న మిల్లులకు సీఎమ్మార్ ట్యా గింగ్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చే పట్టినప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తికాకపోవ డంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా లో ఈ సంవత్సరం రబీ సీజన్‌లో ఒక లక్షా 18 వేల 437 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 2లక్షల 95వేల 759 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దిగుబడి అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకు న్నారు. రబీ సీజన్‌లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరి యైన వసతులు లేని కారణంగానే కొనుగోళ్లు ఆల స్యంగా చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొను గోలు సెంటర్ల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మి ల్లుల్లో నిల్వ చేస్తారు. అయితే సీజన్‌లో ధాన్యం ది గుబడికి సరిపడా రైస్ మిల్లులకు జియో ట్యాగింగ్ ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్న వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 54 రైస్ మి ల్లులు ఉండగా, వాటిలో బాయిల్డ్-19, రా రైస్ మి ల్లులు 35 ఉన్నాయి. వాటిలో సీఎంఆర్ (కస్టమ్ మి ల్లింగ్ రైస్) అనుమతులు 32 మిల్లులకు ఉన్నాయి. గతంలో సీఎంఆర్ పెండింగ్ ఉన్నాయంటూ వాటిలో ఎక్కువ భాగం మిల్లులకు ఈ సీజన్‌లో జియో ట్యా గింగ్ ఇవ్వలేదు. సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 14 రైస్ మిల్లులకే జియో ట్యాగింగ్ ఇవ్వగా, అందులో బాయిల్డ్-07 మిల్లులు, రా మిల్ -01 ఉంది. ఆ ఎ నిమిది మిల్లుల సామర్థ్యం కేవలం 46 వేల మెట్రిక్ టన్నులేని అంచనా. ఇవిపోను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో అక్కడి రైస్ మిల్లులను జిల్లాకు కేటాయిస్తూ 50వేల మెట్రిక్ టన్నుల చొప్పున జియో ట్యాగింగ్ ఇచ్చారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి మొత్తంగా లక్షా 50వేల మెట్రిక్ టన్నుల కంటే మించదు. జిల్లాలోని గోదాముల్లో ఽమరో మూడు వేల మెట్రిక్ టన్నుల వ రకు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. జిల్లాలో ఇంచు మించు రెండు లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ది గుబడి వచ్చినా మిగతా ధాన్యం ఎక్కడ నిల్వ చేయా లో తెలియక కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించారనే అపవాదు ఉంది. పైగా ఇతర జిల్లాల్లో జియో ట్యా గింగ్ ఇచ్చిన కొన్ని మిల్లులు స్థానికంగా ఉన్న మిల్లు ల సీఎంఆర్ బకాయిలకంటే అధికంగా ఉన్నప్పటికీ వాటికి పౌర సరఫరాలశాఖ అధికారులు అనుమతు లు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు జియో ట్యాగింగ్ ఇవ్వడం వల్ల రవాణాలో ఆలస్యం జరిగి సకాలంలో కొనుగోళ్లు జరుగక కూడా రైతులకు నష్టం వాటిళ్లుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
అధికారుల ఒత్తిడే కారణమా...?
జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి సాగు గణనీ యంగా పెరగడం, సీఎమ్మార్ ఇవ్వని 25 మిల్లులపై అధికారులు కేసులు బుక్ చేయడంతో నిల్వ చేసేం దుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో జియో ట్యాగింగ్ ఇచ్చిన 14 మిల్లుల సామర్థ్యం సరిపోక పో వడంతో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వం సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లులపై 25 శాతం అపరాద రుసుం, 12 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. వాస్తవానికి తమపై మోయ లేని బరువు ఎత్తినందునే డిఫాల్టర్లుగా మారామని పలువురు రైస్ మిల్లుల యజమానులు వాపోతు న్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి ధాన్యం కేటాయించడంలో సంబంధిత అధికారులు అత్యుత్సా హం ప్రదర్శించారనే అపవాదు ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే వాస్తవానికి భిన్నంగా మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు జరిగాయి. జిల్లాలో సాగయ్యే వరి ధాన్యం కంటే రైస్ మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం అధికంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఉన్న రైస్ మిల్లుల సా మర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే కేటాయింపుల కం టే లక్ష్యం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పండిన వరి ధాన్యం కంటే మిల్లుల సామర్థ్యం తక్కు వగా ఉండగా, అధికారులు బలవంతంగా మిల్లర్లకు ధాన్యం అంటగట్టినట్లు తెలుస్తోంది. దీంతో సకాలం లో సీఎమ్మార్ ఇవ్వకపోవడంతో మిల్లర్లు డిఫాల్టర్లు గా మిగిలిపోయారు. సీఎంఆర్ కోసం ప్రభుత్వం సర ఫరా చేసిన ధాన్యాన్ని ప్రమాణాల ప్రకారం నిర్దేశిం చిన మేరకు మిల్లర్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బియ్యాన్ని మిల్లర్లు రవాణా చేసేటప్పుడు గోదాముల్లో సరైన స్థలం ఉండాలి. ఈ విషయంలో సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహ రించకపోవడంతోనే సమస్యలు తలెత్తాయన్న అభి ప్రాయాలు ఉన్నాయి. ఈ విషయమై గతంలో ప్రభు త్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించు కోలేదని వాపోతున్నారు. నిబంధనలను గాలికి వదిలి బలవంతంగా అంటగట్టిన ధాన్యం నుంచి నుంచి బి య్యాన్ని రాబట్టేందుకు ప్రభుత్వం పెనాల్టీలు, వడ్డీ లు విధిస్తోందని లబోదిబోమంటున్నారు. ఈ సమ స్యల నుంచి బయట పడేందుకు తప్పనిసరి పరిస్థితు ల్లో కొందరు మిల్లర్లు అక్రమాలకు తెరతీశారని చెబు తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, జియో ట్యాగింగ్ ఇవ్వడం ద్వారా మిల్లర్ల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా చూడాలని మిల్లర్లు కోరుతున్నారు.