kumaram bheem asifabad- ఎన్నాళ్లీ కష్టాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:11 PM
మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామా లకు వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజలు వాగు దాటే సమయంలో గిరిజనుల బాధలు వర్ణనా తీతం. ఇది బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల దుస్థితి. మండలంలోని కుష్నపల్లి- సోమిని గ్రామాల మధ్య రెండు లో లెవల్ వంతెనలపై హై లెవల్ వంతెనలు లేక అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొన్నది.
- వర్షాకాలంలో తప్పని తిప్పలు
- అటవీ అనుమతులే అసలు సమస్య
బెజ్జూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామా లకు వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజలు వాగు దాటే సమయంలో గిరిజనుల బాధలు వర్ణనా తీతం. ఇది బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల దుస్థితి. మండలంలోని కుష్నపల్లి- సోమిని గ్రామాల మధ్య రెండు లో లెవల్ వంతెనలపై హై లెవల్ వంతెనలు లేక అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొన్నది. ఆయా గ్రామాల మధ్య వంతెనల రెండు నిర్మాణానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 2014లో సుశ్మీర్ సమీపంలో ఒర్రెపై వంతెన నిర్మాణానికి రూ.2.15కోట్లు, కుష్నపల్లి సమీపంలో వంతెన కోసం రూ.2.10కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఈ వంతెనల నిర్మా ణానికి అటవీ అనుమతులు లేవన్న కారణంతో పనులు ఆగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య వంతెనలు లేక దాదాపు 10 గ్రామాల గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు.
- మంజూరైన నిధులు వెనక్కి..
కుష్నపల్లి-సోమిని గ్రామాల మధ్య వంతెనల నిర్మాణానికి మంజూరైన నిధులు వెనక్కి మళ్లాయి. ఈ రెండు వంతెనలు లేక సుశ్మీర్, సోమిని, మొ గవెల్లి, సాతసోమిని, గెర్రెగూడ, నాగేపల్లి, బండల గూడ, ఇప్పలగూడ తదితర గ్రామాల ప్రజలకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలోనైతే వారు పడే బాదలు చెప్పదలిచినవి కావు. కనీసం వైద్యానికి వెళ్లాలంటే చుట్టూ వాగుల కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి. వాగులు ఉప్పొంగినప్పుడల్లా బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయి అవస్థలు పడుతున్నారు. నిఽధులు మంజూరై దాదాపు పదేళ్లు కావడంతో పనులు చేపట్టకపోవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నిధులను వెనక్కి తీసుకుంది. దీంతో వారి కష్టాలు షరా మామూలే. గతంలో పలువురు గర్బిణీలు వాగుల కారణంగా కాన్పు కోసం అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. నాగేపల్లి గ్రామానికి చెందిన ఓ గర్బిణీ గతంలో వాగు కారణంగా కాన్పు కోసం బయటకు వెళ్లలేక, వైద్యం అందక మృత్యువాత పడింది. అయినా ప్రభుత్వం వంతెనల విషయంలో చొరవ చూపలేక పోయిందని గిరి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- దశాబ్దాలుగా..
వాగు అవతల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తిప్పలు పడుతూనే ఉన్నారు. వాగుల పై వంతెనలు నిర్మించకపోవడంతో ఎటు వెళ్లాలన్నా వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఆ గ్రామాలకు వెళ్లేందుకు అవస్థలు తప్పవు. కనీసం 108వాహనం కూడా వెళ్లలేని స్థితి నెలకొంది. దీంతో రోగం వస్తే దేవుడిపై భారం వేయాల్సిందే. వంతెనల నిర్మాణాలకు వచ్చిన నిధులు కూడా వెనక్కి మల్లడంతో ఆయా గ్రామాల ప్రజలకు ఇక వంతెనల ఏర్పాటు కలగానే మిగిలింది. వంతెనల నిర్మాణానికి అప్పట్లో నిధులు మంజూరు కాగా ఎంతో సంతోష పడ్డ ప్రజలకు ఇప్పుడు నిధులు వెనక్కి మల్లడం చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే నాయకులు ఎన్నికలయ్యాక మాత్రం తమ గోడును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఏటా వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం వర్షాకాలం ముగియ డంతో పాలకులు ఇకనైనా వంతెనలపై దృష్టి సారిస్తే గిరిజనుల కష్టాలు తీరుతాయని పలువురు చెబుతు న్నారు. ఎన్నో దశాబ్దాలుగా వాగుల కారణంగా అనేక అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపా న పోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.