kumaram bheem asifabad- ఎన్నాళ్లీ అవస్థలు
ABN , Publish Date - May 03 , 2026 | 10:46 PM
జిల్లాలో వివిఽ ద మండలాల అనుసంధానంగా ఉన్న వంతెనలు, రోడ్ల పనులు పూర్తి కాక పోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వి విధ మండలాలకు అనుసంధానంగా ఉండేందుకు రోడ్లు, వంతెనల కోసం పనులు అధికారులు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించారు.
- ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రోడ్ల నిర్మాణాలు
- కాగజ్‌నగర్-వాంకిడి రహదారిపై పూర్తి కాని వంతెన
కాగజ్‌నగర్, మే 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిఽ ద మండలాల అనుసంధానంగా ఉన్న వంతెనలు, రోడ్ల పనులు పూర్తి కాక పోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వి విధ మండలాలకు అనుసంధానంగా ఉండేందుకు రోడ్లు, వంతెనల కోసం పనులు అధికారులు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించారు. ఇంత వరకు నిధులు విడుదల కాక పోవడంతో పనులు సాగడం లేదు. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా నాయకు లు, అధికారులు ఈ పనులపై దృష్టి పెట్టక పోవడంతోనే అభివృద్ధి జరుగటం లేదన్న ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి అసంపూర్తి దశలోనే మగ్గుతున్నాయి. ఫలితంగా వివిధ మండలాల వాసులకు ఏటా ఇక్క ట్లు తప్పడం లేదు. కాగజ్‌నగ ర్-వాంకిడి మధ్యలో ఉన్న అంకుసాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణం 2013లో రూ.1.50 కోట్లతో చేపట్టారు. ఇప్పటికీ ఈ వంతెన నిర్మాణాలు పూర్తి కావడం లేదు. కేవలం నిధుల విడుదల జాప్యం అసలు సమస్యగా ఉంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. 2013లో వేసిన టెండరు పనులకు ఇప్పుడున్న పనుల రేట్లు ఏకంగా రెండింతలు పెరిగాయి. ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వాలు మారుతున్న కూడా నిధులు ఆశించిన మేర విడుదల చేయడం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఈ వంతెన సమీపంలో తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేయడంతో చలికాలం, ఎండకాలం మాత్రమే ఈ మార్గం గుండా రాక పోకలు సాగించాల్సి ఉంటుంది.
- వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు..
వర్షాకాలం వచ్చిందంటే ఈ వంతెన కింద భాగం లో వాగు ఉధృతంగా ప్రవహించి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోతోంది. దీంతో ఏటా వర్షాకాలంలో రాక పోకలు పూర్తిగా నిలిచి పోతాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ఇరు మండలాల నాయకులను, అధికారులను పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా అన్నీ బుట్టదాఖాలే అవుతున్నాయని పలువురు గ్రామస్థుల చెబుతున్నారు. కాగజ్‌నగర్ నుంచి వాంకిడి వెళ్లాలంటే ఆసిఫాబాద్ మీదుగా సరిగ్గా 41 కిలో మీటర్లు ఉంటుంది. ఆసిఫాబాద్‌కు మీదుగా కాకుండా కాగజ్‌నగర్ నుంచి అంకుసాపూర్ మీదుగా వాంకిడికి వెళ్లితే 25 కిలోమీటర్లు వస్తోంది. రవాణా సౌకర్యంతో పాటు దూరం తగ్గుతుందన్న ఉద్దేశ్యంతో అంకుసాపూర్ వాగుపై ఉన్న వంతెన నిర్మించేందుకు 2013లో పనులు ప్రారంభించిన ఇంత వరకు పూర్తి కాని పరిస్థితి దాపురించింది. అలాగే కాగజ్‌నగర్ నుంచి భీమిని మండలాలకు వెళ్లేందుకు చక్కటి మార్గం జగన్నాథ్‌పూర్ మీదుగా ఉంది. జగన్నాథ్ పూర్ గ్రామం దాటగానే చిన్నపాటి వాగు ఉంది. వర్షా కాలంలో చిన్నపాటి వర్షం కురిసిందంటే కూడా ఇక్కడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎడ్లబళ్ల ద్వారానే ఈ వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు మండలాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లను అభివృద్ధి పరిచేందుకు ఇరు మండలాల అధి కారులు సమగ్ర స్థాయిలో సర్వేలు నిర్వహించారు. శాశ్వత దిశగా ప్రణాళికలు కూడా తయారు చేశారు. రూ.10 కోట్ల నిధులు అవసరముతాయని అంచనా లు కూడా రూపొందించారు. ఇప్పటికీ అభివృద్ది పనులు జరుగక పోవడంతో అంతా ఇబ్బందులు పడుతున్నారు. వర్షా కాలంలో వాగులు పొంగితే కాగజ్‌నగర్ భీమిని మండల కేంద్రానికి వెళ్లాలంటే కాగజ్‌నగర్ వయా ఇట్యాల మీదుగా భీమిని వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్లితే 27 కిలోమీటర్ల దూరం వస్తోంది. అదే జగన్నాథ్‌పూర్ మీదుగా నేరుగా ఖర్జీభీంపూర్, భీమిని వెళ్లేందుకు రహదారి ఉండటం 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భీమిని మండలానికి అతి దగ్గరగా ఉండడంతో ఈ మార్గం మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. భీమినిలో రైతులు పండించిన పంటలన్నీంటిని కూడా సమీ పంలో ఉండే కాగజ్‌నగర్ వ్యాపారుల వద్దనే అధికం గా విక్రయాలు జరుపుతుంటారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతోంది. ఇప్ప టికైనా అధికారులు రోడ్లు, వంతెన పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.