kumaram bheem asifabad- సహకార ఎన్ని‘కలే’నా..?
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:15 PM
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్ ప్రతిపాదికన ఎన్నికుంటారనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఇటీవల ఆయా పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్‌ల చైర్మన్లు, డీసీసీబీకి చైర్మన్, పాలకవర్గాన్ని ఎన్నుకునేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహకార సొసైటీల పదవులను నామినేటెడ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలియడంతో నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయారు.
- కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో చిగురిస్తున్న ఆశలు
- జిల్లా నాయకుల మద్దతు కూడగట్టుకునే యత్నం
జైనూర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్ ప్రతిపాదికన ఎన్నికుంటారనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఇటీవల ఆయా పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్‌ల చైర్మన్లు, డీసీసీబీకి చైర్మన్, పాలకవర్గాన్ని ఎన్నుకునేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహకార సొసైటీల పదవులను నామినేటెడ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలియడంతో నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయారు. గ్రామీణ స్థాయిలో డిమాండ్ ఉన్న పదవి కావడంతో సహకార ఎన్నికలు హోరాహోరిగా సాగేవి. కానీ ప్రస్తుతం పదవులను నామినేట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. హైదరాబాద్ దారి పట్టిన నాయకులు తమ పేర్లు నామినేట్ చేయాలని కోరుతున్నారు. కాగా సహకార సంఘాల పాలక వర్గాలు, డీసీసీసీబి, డీసీఎంఎస్ పాలక వర్గాలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడి పడి ఉన్న ఈ సహకార సం ఘాల పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సహకార ఎన్నికల్లో సైతం సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఎన్నికలు జరుగుతాయి. ఈ సహకార పాలక వర్గ పదవు లను నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయను న్నట్లు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చర్చ కొనసాగుతోంది. ఈ పదవులను దక్కించుకునేందు కు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఎవరికి వారుగా ఉన్నప్పటికీ భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పదవులు దక్కించు కునేందుకు గ్రామాల్లోని పలువురు అధికార పార్టీ నాయకులు పలుమార్లు హైదరాబాదుకు వెళ్లి జిల్లాకు చెందిన కీలక నేతలను కలుస్తున్నారు. సహకార పదవుల్లో తమను నామినేట్ చేయించేలా చూడాలని కోరుతున్నారు.
- కొత్త సొసైటీల కోసం..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సహకార సంఘాలను పెంచేందుకు ఇప్పటికే కసరత్తు జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 12 సహకార సొసైటీలు ఉన్నాయి. కానీ సహకార పదవులు నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వనున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలకు చెందిన రైతులు అఖిల పక్షాల ఆధ్వర్యంలో తమ గ్రామం కేంద్రంగా సొసైటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు లింగాపూర్ మండలం పేరట సొసైటీ లేదు. ఇక్కడ సొసైటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం చేసింది. అదేవిధంగా ఇదే మండలానికి చెందిన కొందరు ముఖ్య నేతలు తమకు సహకార సొసైటీ మంజూరు చేయాలని గతంలోను కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో పాటు చింతల మానేపెల్లి, పెంచికలపేట, లింగా పూర్ తదితర మండలాల్లో సొసైటీల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపించామని ఇన్‌చార్జి డీసీవో మోహన్ తెలిపారు. కీలకమైన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు, డైరెక్టర్ల పోస్టులు ఆశిస్తున్న నాయకులు సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తమ స్థాయిలో తీవ్రంగా ప్రయ త్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల మధ్య డీసీసీసీ, డీసీఎంఎస్ పదవుల తో పాటు అన్ని సహకార సంఘాల్లో చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోసం పోటా పోటీ నెలకొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి కొన్ని గ్రామాలకు సొసై టీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.