Share News

kumaram bheem asifabad- నీరు నిలిచేదెలా..

ABN , Publish Date - Jul 04 , 2026 | 10:50 PM

వర్షాకాలం ప్రారంభమై అడపాదడపా వర్షాలు కురుస్తు న్నాయి. అయితే మండలంలోని చెరువులను మాత్రం శుభ్రం చేసే పనులు చేపట్టలేదు. ఏళ్ల తరబడి శుభ్రం చేయక పూడిక చేరింది. అలాగే తూటికాడ(బేస్రం) అల్లుకపోయింది. ఇది మండల కేంద్రం సమీపంలోని బోలు చెరువు దుస్థితి....ఈ చెరువు కింద ఆయకట్టు సుమారు 200ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం చెరువులో చెత్తాచెదారం. ఇతర మొక్కల పెరుగుదలతో సాగునీరు నిల్వ లేకుండా పోతోంది.

kumaram bheem asifabad- నీరు నిలిచేదెలా..
లోగో

- ఏటేటా తగ్గుతున్న సాగు

- పట్టించుకోని అధికారులు

బెజ్జూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభమై అడపాదడపా వర్షాలు కురుస్తు న్నాయి. అయితే మండలంలోని చెరువులను మాత్రం శుభ్రం చేసే పనులు చేపట్టలేదు. ఏళ్ల తరబడి శుభ్రం చేయక పూడిక చేరింది. అలాగే తూటికాడ(బేస్రం) అల్లుకపోయింది. ఇది మండల కేంద్రం సమీపంలోని బోలు చెరువు దుస్థితి....ఈ చెరువు కింద ఆయకట్టు సుమారు 200ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం చెరువులో చెత్తాచెదారం. ఇతర మొక్కల పెరుగుదలతో సాగునీరు నిల్వ లేకుండా పోతోంది. దీంతో ఆయకట్టు కింద సాగు ఏటా తగ్గుతూ వస్తోంది. అధికారులు పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపట్టని కారణంగా ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చెరువు మత్తడి కూడా శిథిలావస్థకు చేరడంతో నీరంతా వృథాగా పోతోంది. గత కొన్నేళ్ల నుంచి చెరువుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నా సంబంధిత నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.

- తగ్గుతున్న నీటి నిల్వలు..

చెరువులో చెత్తాచెదారం తొలగించక పోవడంతో నీటి నిల్ల సామర్ధ్యం తగ్గిపోతోంది. బోలు చెరువును శుభ్రం చేయక పూడికతో పాటు పిచ్చిమొక్కలు చెత్తాచెదరాం పేరుకు పోయింది. వాటిని తొలగించకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోతుంది. దీంతో చెరువు కింద సాగు చేసే పంటలకు సాగునీటి కొరత ఏర్పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో చెరువులో నీరు చేరిన సమయంలో తూటికట్టె మరింత విస్తరిస్తుందని రైతులు వాపోతున్నారు. మండలంలో అధికంగా వర్షాధారం, చెరువులపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా చెరువును శుభ్రం చేయిస్తే నిల్వ సామర్థ్యం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 10:50 PM