Share News

kumaram bheem asifabad- సమస్యలు తీరేదెలా..?

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:11 PM

పల్లెల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ సమస్య లు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడంలేదు. దీంతో సమస్యలు విని పించి పరిష్కరించుకునే దారి లేక ఇబ్బందులు పడు తున్నారు.

kumaram bheem asifabad- సమస్యలు తీరేదెలా..?
లోగో

- అంతర్మథనంలో సర్పంచ్‌లు

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ సమస్య లు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడంలేదు. దీంతో సమస్యలు విని పించి పరిష్కరించుకునే దారి లేక ఇబ్బందులు పడు తున్నారు. గతంలో మండల పరిషత్‌ పాలకవర్గాలు ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలో సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలు అధికారులకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచ్‌లకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడంలేదు. గత డిసెంబరులో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలు ఎలా తెలు పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- మూడు మాసాలకోసారి..

గతంలో మండల పరిషత్‌ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు మాసాలకోకసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్‌లు హాజరయ్యే వారు. డివిజన్‌స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం పాల్గొనే వారు. మండలంలో ప్రతీ ప్రభుత్వశాఖ అధికారి తమశాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్యుత్‌, విద్య, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్‌, పీఆర్‌ ఇంజనీరింగ్‌, ఐకేపీ, ఉపాధి హామీ, పశుసంవర్థక, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రా మాల సర్పంచ్‌లు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్న లు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరి ష్కారం అధికారులు వివరించేవారు. దీంతో సర్పంచ్‌ లకు మండల అధికారుల మధ్య మంచి సంబం ధాలు ఏర్పడేవి. డివిజన్‌స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకు పోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికగా నిలిచేవి.

- పాలన అస్తవ్యస్తం..

గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీ, మండల పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వ హించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డి సెంబరు మాసంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపో యాయి. పలుచోట్ల సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచ్‌లు తమ గ్రామాల సమస్యలు ఎ లా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండల స్థాయి అధికారులకు తమకు మధ్య పరిచ యం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుం టుందని పలువురు చెబుతున్నారు. మండలసభ ఏర్పాటు చేస్తే అధికారులకు, సర్పంచ్‌లకు మధ్య సమన్వయం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

మండల సమావేశం ఏర్పాటు చేయాలి..

- జాబరి రవిందర్‌, సర్పంచ్‌, గుండి

నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లతో ప్రభుత్వ అధి కారులు మండలాల్లో మండల సమావేశాలు ఏర్పా టు చేయాలి. దీంతో అధికారులకు, సర్పంచ్‌లకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. అభివృద్ధి పను లు, సమస్యలపై చర్యలు కొనిసాగితే ఎలా ముందకు వెళ్లలనే విషయంపై అవగాహన కలుగుతుంది. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.

అవగాహన కలుగుతుంది..

- కుడ్మెత స్వప్న, సర్పంచ్‌, కౌటగూడ

మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంపై సర్పంచ్‌లకు అవగాహన కలుగుతుంది. అధికారులు ఇచ్చే సలహా లు, సూచనలు సర్పంచ్‌లకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటాయి. ఉన్నతాధికారులు దీనిపై ఆలో చించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

Updated Date - Mar 17 , 2026 | 11:11 PM