Share News

kumaram bheem asifabad- రైతులక బీమా భరోసా ఎలా..?

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:11 PM

కుటుంబంలో రైతు చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెన్యూవల్‌ ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. ప్రతి ఏటా కొత్త రైతులను కూడా చేర్చుకుంటూ పోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగించింది.

kumaram bheem asifabad- రైతులక బీమా భరోసా ఎలా..?
లోగో

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలు కోసమే నిలిపివేత

కాగజ్‌నగర్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో రైతు చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెన్యూవల్‌ ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. ప్రతి ఏటా కొత్త రైతులను కూడా చేర్చుకుంటూ పోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగించింది. 2026-27 బడ్జెట్‌ సందర్భంగా కొత్తగా జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్‌ 2 వరకు విధి విధానాలు ఖరారు కాక పోవడంతో పాటు ఇంత వరకు ఎలాంటి జీవోలను విడుదల చేయలేదు. ఆగస్టు 15 వరకు రైతు భీమా పాలసీ గడువు ఉన్నందున ఆలోపు మార్గదర్శకాలు తయారు చేసి రైతులకు ఇబ్బంది కలుగకుండా కొత్త పాలసీని అమల్లోకి తీసుకరావాలని ప్రభుత్వం భావించింది. ఆగస్టు పూర్తయినా ఇందిరమ్మ కుటుంబ బామా పథకం ఇంత వరకు అమల్లోకి రాలేదు. ఈ పథకం వస్తే రైతు బీమా కంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు బీమా ఉన్న లేక పోయిన ఈ పరిధిలోకి తీసుకవచ్చే అవకాశాలతో ఈ పథకం చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గడువులోగా..

ఏ బీమా పాలసీ అయినా గడువులోపు ప్రీమియం చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవలసి ఉంటుంది. ప్రీమియందారు మరణిస్తే ఆ బీమా సొమ్ము నామినీలకు అందుతుంది. ఆలస్యమైతే ఫైన్‌ ద్వారా తీసుకుంటారు. కానీ ఆ మధ్యలో చనిపోతే మాత్రం సొమ్ము రాదు. ఇప్పుడు రైతు భరోసా పరిస్థితి అలాగే ఉంది. కొత్త భీమా పథకం ప్రారంభించక ముందే పాత భీమా పథకాన్ని నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఆరు నెలలకు రెన్యూవల్‌ చేసి ఇది అమల్లో ఉండగానే కొత్త బీమా పథకాన్ని ప్రారంభిస్తే బాగుండేదని రైతులకు లబ్ధిచేకూరే అవకాశం ఉంది. అంటే దాదాపు రైతు భీమా కంటే రెండు రెట్లు ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేది. కేవలం రైతులే కాకుండా వ్యవసాయ కూలీలు ఇతర వృత్తి పనుల వారు పేదలంతా ఈ పథకంలో భాగస్వాములవుతారు. రైతు బీమా పూర్తి వ్యక్తి గత బీమా పథకం కాగా పంటలకు నష్టం జరిగితే అమలు చేసే పంటల బీమా పథకం కూడా ఏళ్లుగా కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2019-2020 నుంచి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలు చేయక నిలిపివేసింది. ఆ తర్వాత నాలుగేళ్లుగా అమలు చేయడం లేదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. కాని 2024, 2025, 2026 సంవత్సరాల్లో అమలు చేయలేదు. గతేడాది అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం కూడా అందలేదు. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేక పోవడంతో పంటలు వేసిన రైతులు వాటిని కాపాడు కోలేని పరిస్థితి ఉంది. సెప్టెంబరులో కూడా వర్షాలు పెద్దగా కురువ లేదు. దీని వల్ల దిగుబడి కూడా పడిపోయే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:11 PM