kumaram bheem asifabad- చదువులు సాగేదెలా..?
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:39 PM
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)తో ఉపాఽధ్యాయులు కొన్ని రోజులుగా పాఠశాలలకు దూరంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ముందుకు సాగడంలేదు. ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ పరీక్ష ఉండడంతో ఉపాధ్యాయులు తీరికలేకుండా ఉన్నా తరుణంలో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరుగనున్నాయి.
- ఆ తరువాత టెట్ పరీక్ష
- త్వరలో మున్సిపల్ ఎన్నికల శిక్షణ, విధులు
- ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు ఆటంకాలు
- పదో తరగతి ఫలితాలపై ప్రభావం
వాంకిడి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)తో ఉపాఽధ్యాయులు కొన్ని రోజులుగా పాఠశాలలకు దూరంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ముందుకు సాగడంలేదు. ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ పరీక్ష ఉండడంతో ఉపాధ్యాయులు తీరికలేకుండా ఉన్నా తరుణంలో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులకు శిక్షణ, ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 65 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 3,335 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి విద్యార్థులకు జనవరి లోగా సిలబస్ పూర్తి చేసి రివిజన్(పునఃశ్చరణ) తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం, వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. పరీక్షల్లో అవగాహన పెంచుకు నేందుకు రోజువారీగా స్లిప్ టెస్ట్‌లతో పాటు వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన కల్పించాలి. కానీ వరుసగా వస్తున్న ఎన్నికలు నాయకులకు, అభ్యర్థులకే కాకుండా విద్యార్థులకూ ఓ పరీక్షలా తయారైనాయి. ఇటు ఎన్నికల శిక్షణ, అటు టెట్ పరీక్షలకు సంసిద్ధం కావాల్సి ఉండడంతో ఉపాధ్యాయులు కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్నో తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు ఎన్నికలు రావడం మరింత ఇబ్బందిగా తయారైంది. ఉదయం, సాయంత్ర ప్రత్యేక తరగులు ఏర్పాటు చేసి వార్షికపరీక్షలకు ప్రణాళికలతో విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడం ఫలితాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
- ప్రారంభం నుంచి అడ్డంకులే..
విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విద్యాబోధనలకు ఆటంకం కలుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ నిర్వహించారు. దీంతో విద్యాబోధనకు అవాంతరాలు ఎదురయ్యాయి. అనంతరం స్వాతంత్య్ర దినోత్స వేడుకలు, ఆతర్వాత దసరా సెలవులు రావడంతో బోధన అంతంత మాత్రంగానే సాగింది. అంతలోనే మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అందులోనూ ఉపాధ్యాయులకే విధులు కేటాయించారు. తరువాత సంక్రాతి సెలవులు రావడంతో ఇలా పలుకారణాలతో చదువులు సాగలేదు విద్యబోధనలు సవ్యంగా కొనసాగలేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు మార్చి 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో చదువులు సరిగా సాగక విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారో అన్న భయందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నికల ప్రభావంతో ఈ సారి పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.