ఇళ్లు నాణ్యతగా నిర్మించాలి
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:20 PM
కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లలో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని గురువారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
కల్వకుర్తి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లలో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని గురువారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ రైతులతో మా ట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసు కొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా త్వ రితగతిన కొనుగోలు చేసి మిల్లులకు త రలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించా రు. అనంతరం కల్వకుర్తి పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులతో నేరు గా మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, ఎ దురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నా రు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరి మితం కాకుండా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయో జనం చేకూరేలా సమర్థవంతంగా అమలు కా వాలన్నారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రతీ అభివృద్ధి పని ప్రజల జీవన ప్రమాణా లను మెరుగుపరిచే విధంగా ఉండాలని అన్నా రు. ప్రతీశాఖ అధికారి తమ బాధ్యతలను సమ ర్థవంతంగా నిర్వర్తిస్తూ పనుల్లో నాణ్యత, పార దర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలని సూ చించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకో వడం ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ రత్నమాల, కమిషనర్ అహ్మద్, కౌన్సి లర్లు, వ్యవసాయ మార్కెటింగ్, ఐకేపీ, గృహ నిర్మాణ శాఖల అఽధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.