ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయించాలి
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:06 PM
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులందరూ త్వరగా నిర్మాణా లు పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వ హించాలని జిల్లా హౌసింగ్ పీడీ గో పాల్ నాయక్ పేర్కొన్నారు.
- జిల్లా హౌసింగ్ పీడీ గోపాల్‌నాయక్
తాడూరు, జూలై 21 (ఆంధ్రజ్యో తి) : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులందరూ త్వరగా నిర్మాణా లు పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వ హించాలని జిల్లా హౌసింగ్ పీడీ గో పాల్ నాయక్ పేర్కొన్నారు. మంగళ వారం మండలంలోని గుట్టలపల్లి, మేడిపూర్, పొల్మూరు గ్రామాల్లో ని ర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాడూరు మండ లానికి 515ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 135 ఇళ్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని గృహప్ర వేశాలు సైతం పూర్తయ్యాయని ఏఈ హను మంతు వివరించారు. మిగతా నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశం కోసం సిద్ధం చేస్తామ ని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ హరినాయక్, ఎంపీడీవో శోభారాణి, హౌసింగ్ ఏఈ హనుమంతుతో పాటు గుట్టలపల్లి గ్రామ సర్పంచ్ ప్రశాంత్‌రెడ్డి, మేడిపూర్ గ్రామ సర్పంచ్ మల్లయ్య, ఆయా గ్రామాల పంచా యతీ కార్యదర్శులు పాల్గొన్నారు.