ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , Publish Date - May 15 , 2026 | 11:03 PM
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. కార్పోరేషన్‌లోని 32వ డివిజన్‌లో శుక్రవారం మేయర్ ధర్ని మధుకర్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
అదనపు కలెక్టర్ చంద్రయ్య
నస్పూర్, మే 15 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. కార్పోరేషన్‌లోని 32వ డివిజన్‌లో శుక్రవారం మేయర్ ధర్ని మధుకర్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అంతే కాకుండా డివిజన్‌లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తొందరగానే పరిష్కరిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ళ నిర్మాణాల లబ్దిదారులతో మాట్లాడారు. వీలైనంత వరకు తొందరగా నిర్మాణాలను పూ ర్తి చేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయసహాకారాలు అందిస్తామన్నారు. ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను పిలిపిం చి మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, హౌసింగ్ శాఖ అధికారులు, డివిజన్ అధికా రులు, 32వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.